మైదానాల్లో రాణించినా మంచి భవిష్యత్తు ఉంటుంది:తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి

Spread the love

నిరంతరం ప్రజా సమస్యలతో క్షణం తీరిక లేకుండా ఉండే ప్రజాప్రతినిధులు క్రీడలు, వారు ప్రదర్శించిన కళలు రాష్ట్రంలోని లక్షలాది విద్యార్థినీ విద్యార్థులకు స్ఫూర్తిగా నిలుస్తాయని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. క్రీడలు, సాంస్కృతిక శాఖల ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో నిర్వహించిన వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.  మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, డిప్యూటీ సీఎం  మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

చాలా మంది తమ విద్యార్థి దశలో క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నప్పటికీ, వృత్తి జీవితంలో స్థిరపడిన తర్వాత తమలోని కళను, నైపుణ్యాలను మరిచిపోతున్నారన్నారని సీఎం రేవంత్ పేర్కొన్నారు.  ఈ మధ్యకాలంలో విద్యార్థులు కొందరు వ్యసనాలకు బానిసలవుతున్నారుని విద్యార్థినీ విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికితీయాలన్న ఉద్దేశంతోనే గ్రామీణ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు సీఎం కప్ పోటీలు నిర్వహించినట్లు తెలిపారు. చదువులో రాణిస్తేనే భవిష్యత్తు ఉంటుందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మైదానాల్లో రాణించినా మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పారు.  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాసనసభ బడ్జెట్ సమావేశాల సందర్భంగా క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేవారని అయితే  తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆ సంప్రదాయం కనుమరుగైందన్నారు. శాసనమండలి చైర్మన్, శాసనసభ స్పీకర్ విజ్ఞప్తి మేరకు ఈ కార్యక్రమాలను పునరుద్ధరించినట్లు తెలిపారు.ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాల్లో రాజకీయాలకు అతీతంగా అందరూ పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు క్రీడలు, సాంస్కృతిక శాఖలను సీఎం రేవంత్  అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *