పోలీసు సిబ్బంది సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం అడుగులు

Spread the love

పోలీసు సిబ్బంది సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోందని ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి అనిత అన్నారు.  అమరావతిలో జరిగిన ప్రజా దర్బార్‌లో APSP హెడ్ కానిస్టేబుళ్లు తమ ఏళ్ల నాటి పదోన్నతుల సమస్యను మంత్రి నారా లోకేష్  గారి దృష్టికి తీసుకురాగా, ఆయన చొరవతో అది నేడు సాకారమైందని తెలిపారు. హోం శాఖ పరంగా మేము తీసుకున్న తక్షణ చర్యల వల్ల 300 మంది హెడ్ కానిస్టేబుళ్లకు అసిస్టెంట్ రిజర్వ్ సబ్-ఇన్‌స్పెక్టర్లుగా (ARSI) పదోన్నతులు లభించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొన్నారు.  ఈ నిర్ణయం ఆయా అధికారుల కుటుంబాల్లో కొత్త వెలుగులు నింపడమే కాకుండా, విధి నిర్వహణలో వారికి మరింత ప్రోత్సాహాన్ని అందిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *