ధురంధర్-2 వచ్చేస్తోంది…విడుదలైన ట్రైలర్

Spread the love

రణ్ వీర్ సింగ్ హీరోగా తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్’ సినిమా ఎంతటి సంచలన విజయాన్ని నమోదు చేసిందో తెలిసిందే.  ఆదిత్యధర్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో  సారా అర్జున్ కథానాయిక. మాధవన్, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించారు. తాజాగా ఈ మూవీకి సీక్వెల్ గా రానున్న ‘ధురంధర్-2’ ట్రైలర్ విడుదలైంది. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ మార్చి 19న విడుదల కానుంది. ఈ సందర్భంగా తాజాగా విడుదల చేసిన ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచింది.’ధురంధర్ 2: ది రివెంజ్’. (Dhurandhar the revenge)గా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది.  ‘ధురంధర్: పార్ట్1’తో పోలిస్తే రెండో భాగంలో యాక్షన్ తో పాటు మొదటి భాగంలోని అనేక ప్రశ్నలకు సమాధానం దొరకనుంది. ఈ సినిమా విడుదల కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారంటే దీనికున్న క్రేజ్ ను అర్ధం చేసుకోవచ్చు. హిందీతో పాటు, ఇతర సౌతిండియా లాంగ్వేజెస్ లో  ఈ సినిమాను తీసుకొస్తున్నారు. పెయిడ్ ప్రీమియర్స్ వరకు హిందీలోనే బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. హైదరాబాద్ లోని వివిధ మల్టీప్లెక్స్ లలో ఇప్పటికే టికెట్స్ అందుబాటులోకి వచ్చాయి. ఇక మొదటి భాగం దేశవ్యాప్తంగా సంచలన విజయం సాధించడంతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా పొందింది. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *