సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటించారు. ఈ సందర్భంగా గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ విజయవాడలోని లోక్ భవన్ లో మర్యాదపూర్వకంగా తేనీటి విందు ఇచ్చారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా పాల్గొన్నారు. సుప్రీమ్ కోర్టు న్యాయమూర్తులు జస్టిస్ జె కె మహేశ్వరి, జస్టిస్ పమిడిఘంటం శ్రీ నరసింహ, జస్టిస్ పి.కె.మిశ్రా, జస్టిస్ ఎస్ వి ఎన్ భట్టి, జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చి , హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ తదితరులు హాజరయ్యారు.