పశ్చిమాసియా పరిస్థితులపై పలు దేశాల ఆందోళన..ఖమేనీ మృతికి పుతిన్ సంతాపం

Spread the love

పశ్చిమాసియాలో నెలకొన్న ఆందోళనకర పరిస్థితులపై అంతర్జాతీయ నేతలు స్పందిస్తున్నారు. తాజాగా ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మృతిపై రష్యా ప్రెసిడెంట్  పుతిన్ సంతాపం తెలిపారు. అంతర్జాతీయ చట్టాలు, నైతిక విలువలను అమెరికా, ఇజ్రాయెల్ ఉల్లంఘించాయని పుతిన్ పేర్కొన్నారు.  ఇరాన్ పై దాడులను తక్షణమే ఆపాలని డిమాండ్ చేశారు. ఇరాన్ ప్రెసిడెంట్ పెజెష్కియాన్కు రాసిన లేఖలో పుతిన్ ఈమేరకు పేర్కొన్నట్లు రష్యన్ మీడియా వెల్లడించింది. మరోవైపు ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ తయారీని నిలిపివేయాలని జపాన్ సూచించింది. అమెరికా, ఇరాన్ చర్చలు కొనసాగించాలని పేర్కొంది. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలతో పశ్చిమాసియా గందరగోళంలోకి జారిపోయే ప్రమాదం ఉందని ఈజిప్టు అధ్యక్షుడు అబ్దల్ ఫతా ఎల్సిసి ఆందోళన వ్యక్తం చేశారు. ఇక  తమ దేశంపైకి దూసుకొస్తున్న మిస్సైల్స్, డ్రోన్లు అడ్డుకుంటున్నట్లు కువైట్, ఖతర్, బహ్రెయిన్లు తెలిపాయి. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *