మ్యూజిక్ డైరెక్టర్ గా విజయవంతంగా ముందుకు సాగుతూనే నటుడిగా కూడా మెప్పిస్తున్నాడు జీ.వి.ప్రకాష్ కుమార్.ఇటీవల ఆయన తమిళంలో నటించిన ‘ఇమ్మోర్టల్ మూవీ ఇప్పుడు తెలుగులో కూడా విడుదల కానుంది. మారియప్పన్ చిన్నా దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అక్కడ హిట్ ను అందుకుంది. కయాదు లోహర్ కథానాయికగా నటించింది. జీ.వి.ప్రకాష్ నటన, విజువల్ గా ఈ సినిమా బాగుందని చెబుతున్నారు. ఎన్నో విజయవంతమైన సినిమాలకు సంగీతాన్ని అందించి సంగీత దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న జీ.వి. ప్రకాష్ కుమార్.. నటుడిగానూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ నటుడిగా తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు.ఇటీవల జీ.వి. ప్రకాష్ కుమార్ తమిళంలో నటించిన ‘ఇమ్మోర్టల్’ ‘నాకు మరణం లేదు’ అనేది సబ్ టైటిల్. ఈ సినిమా ఈ నెల 19న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మారియప్పన్ చిన్నా దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి తమిళ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించినట్లు చిత్రబృందం చెబుతోంది. ముఖ్యంగా సినిమాలోని కథ, విజువల్ ట్రీట్, నటీనటుల పెర్ఫార్మెన్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్న అంశాలుగా నిలిచాయని టాక్ వినిపించింది. ఈ సినిమాలో జీ.వి. ప్రకాష్ కుమార్ ప్రధాన పాత్రలో కనిపించాడు. ‘ఇమ్మోర్టల్’లో ఆయన పాత్రకు తగినట్టుగా నటనలో వైవిధ్యాన్ని చూపించారని సినిమా చూసిన వారు అభిప్రాయపడుతున్నారు. కయాదు లోహర్ ఈ చిత్రంలో కథానాయికగా నటించింది.శామ్ సీ ఎస్ సంగీతం అందించారు. ‘ఇమ్మోర్టల్’ సినిమాకు విజువల్స్ ప్రధాన ఆకర్షణగా నిలిచినట్లు సమాచారం. కథను తెరపై చూపించే విధానం, విజువల్ ట్రీట్మెంట్ వంటి అంశాలు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగించేలా ఉన్నాయని టాక్. దీంతో సినిమా కథతో పాటు విజువల్ ఎక్స్‌పీరియన్స్‌పైనా ప్రేక్షకుల్లో ఆసక్తి ఏర్పడింది. మారియప్పన్ చిన్నా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తమిళంలో ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి హిట్ ను అందుకుంది. ఇప్పుడు ‘ఇమ్మోర్టల్’ను తెలుగులో కూడా విడుదల చేసేందుకు చిత్రబృందం సిద్ధమవుతోంది. మొత్తంగా సంగీత దర్శకుడిగా విజయవంతమైన ప్రయాణాన్ని కొనసాగిస్తూనే నటుడిగానూ తన సత్తాను చాటుతున్న జీ.వి. ప్రకాష్ కుమార్‌కు ‘ఇమ్మోర్టల్’ మరో ముఖ్యమైన సినిమాగా నిలవనుంది. మరి తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాను, జీ.వి. ప్రకాష్ కుమార్ నటనను ఏ స్థాయిలో ఆదరిస్తారో చూడాలి.