తెలుగు సినీ పరిశ్రమలో కొత్త తరహా కథలతో ప్రేక్షకులను ఆకట్టుకునే దర్శకుల సంఖ్య ఇప్పుడు క్రమంగా పెరుగుతోంది. విభిన్నమైన కథలతో కొత్త తరహా టేకింగ్ తో వస్తున్న దర్శకులకు ప్రేక్షకుల నుండి కూడా మంచి ఆదరణ లభిస్తుంది. అలాంటి దర్శకులలో యుగంధర్ ముని పేరు ఇండస్ట్రీలో ప్రత్యేకంగా వినిపిస్తోంది. ఆయన తెరకెక్కించిన ‘శంబాల’ చిత్రం ప్రేక్షకుల ఆదరణ పొందింది. ఇప్పుడు అదే జోష్‌తో యుగంధర్ ముని మరో భారీ అడ్వంచర్ ప్రాజెక్ట్‌ను సిద్ధం చేస్తున్నారు. హీరో సందీప్ కిషన్ తో ఆయన సినిమా చేస్తున్నారు. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ గురించి వచ్చిన వార్తలు సినీ అభిమానుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. ముఖ్యంగా కాన్సెప్ట్ పోస్టర్ విడుదలైనప్పటి నుండి సోషల్ మీడియాలో ఈ సినిమా పై ఆసక్తి ఏర్పడింది. ఇప్పుడు సందీప్ కిషన్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన కొత్త పోస్టర్ ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది. పోస్టర్‌లో కనిపించిన విజువల్స్ చాలా ఇంటెన్స్‌గా ఉన్నాయి. ఒక చిన్న బిడ్డ, అతడి చేతిలో ఖడ్గం, వెనుక భాగంలో కనిపిస్తున్న సింహం… ఇవన్నీ కలిసి పోస్టర్‌కు ఒక మిస్టికల్ ఫీల్ తీసుకొచ్చాయి. ఈ పోస్టర్ చూస్తుంటే ఇది కేవలం అడ్వంచర్ సినిమా మాత్రమే కాదు, ఒక ఎమోషనల్ ప్రయాణంలా కూడా ఉండబోతుందని అనిపిస్తోంది. ముఖ్యంగా ‘A LEGEND IS BORN ‘ అనే ట్యాగ్‌లైన్ ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది.
ఇప్పటివరకు సందీప్ కిషన్ ఎన్నో విభిన్నమైన పాత్రలు చేశారు. రొమాంటిక్, యాక్షన్, థ్రిల్లర్, కామెడీ ఇలా అన్ని జానర్స్‌లో తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ ఈసారి మాత్రం ఆయన పూర్తిగా కొత్త అవతార్‌లో కనిపించబోతున్నారని అభిమానులు భావిస్తున్నారు. ఇటీవల కాలంలో పాన్ ఇండియా సినిమాలకు ప్రేక్షకుల్లో ఉన్న ఆదరణను దృష్టిలో పెట్టుకుని ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. కథలో ఉన్న యూనివర్సల్ ఎమోషన్స్,విభిన్న ఎలిమెంట్స్ అన్ని భాషల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటాయని తెలుస్తోంది.
ఈ ప్రాజెక్ట్‌ను షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై మహిధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభీమోజు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి. అడవిలో షూటింగ్ చేయాల్సి ఉండటంతో ప్రత్యేకమైన లొకేషన్స్‌ను ఎంపిక చేస్తున్నారట. అలాగే పాత్రల కోసం ప్రత్యేకంగా కాస్ట్యూమ్స్, ఆయుధాలు, సెట్స్ డిజైన్ చేస్తున్నారని సమాచారం. దర్శకుడు యుగంధర్ ముని ప్రతి చిన్న విషయాన్ని చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నారట. ఎందుకంటే ఈ సినిమా కేవలం ఒక కమర్షియల్ మూవీ కాకుండా, ప్రేక్షకులను మరో ప్రపంచంలోకి తీసుకెళ్లే విజువల్ ఎక్స్‌పీరియన్స్‌గా ఉండాలని రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.ఆగస్టు నెలలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. ముఖ్యంగా ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు చాలా కొత్తగా ఉండబోతున్నాయని టాక్ వినిపిస్తోంది.