ఈ ఏడాది ప్రజలకు రెట్టింపు సంతోషం – సంక్షేమం – అభివృద్ధి అందించేందుకు కృషి చేస్తా:ఏపీ సీఎం చంద్రబాబు

Spread the love

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ ఏపీ సీఎం చంద్రబాబు 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈమేరకు సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా పోస్ట్ చేశారు.  గడిచిన 2025 సంవత్సరంలో కూటమి ప్రభుత్వ పాలన మరిచిపోలేని విజయాలను అందించింది. ఎన్నో మైలురాళ్లను చేరుకుంది. అనేక సంక్షేమ కార్యక్రమాలకు, అభివృద్ధి పనులకు 2025 ఏడాది నాంది పలికింది. ఏ రంగంలో చూసినా… 2025 కేవలం ఒక గడిచిన సంవత్సరం కాదు…. నాటి విధ్వంసం నుంచి ఆంధ్రప్రదేశ్‌ ను వికాసం వైపు నడిపించిన గొప్ప మలుపు. ఎన్నో సంక్షోభాలను, సమస్యలను, సవాళ్లను అధిగమించి గొప్ప పురోగతి సాధించిన సంవత్సరంగా 2025 గుర్తుండిపోతుంది. ఇదే స్ఫూర్తితో ఇంగ్లీషు క్యాలెండర్ ప్రకారం ప్రారంభమయ్యే 2026 నూతన సంవత్సరం అందరి జీవితాలలో కొత్త కాంతులు నింపాలని మనసారా కోరుకుంటున్నాను. ఈ ఏడాది ప్రజలకు రెట్టింపు సంతోషం – సంక్షేమం – అభివృద్ధి అందించేందుకు కృషి చేస్తానని మాటిస్తున్నాను. హెల్తీ, వెల్తీ, హ్యాపీ ఏపీ లక్ష్యాన్ని చేరుకోవడంలో ఈ ఏడాది మరెన్నో అడుగులు పడాలని కోరుకుంటూ….అందరికీ హ్యాపీ న్యూ ఇయిర్ 2026 అంటూ ఆయన రాసుకొచ్చారు. 

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్:

తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ కొత్త సంవత్సరం మీ అందరి జీవితాల్లో సంతోషాలు నింపాలని ఆకాంక్షిస్తున్నాను. 

ఏపీ మంత్రి నారా లోకేష్: 

అంద‌రికీ నూత‌న సంవ‌త్స‌రం శుభాకాంక్ష‌లు. ఆశ‌యాల సాధ‌న‌కు ఆత్మ‌విశ్వాసంతో ప్ర‌య‌త్నిద్దాం. క‌ల‌లు సాకారం చేసుకునేందుకు క్ర‌మ‌శిక్ష‌ణ‌తో శ్ర‌మిద్దాం. శాంతి, క్రాంతిని పెంచేందుకు ఈ కొత్త ఏడాదిలో సమష్టి కృషి చేద్దాం. ప్ర‌గ‌తి-సంక్షేమాల‌తో న‌వ‌వ‌సంతం ప్ర‌జ‌ల‌కు ఆయురారోగ్య, ఆనందాలు పంచాల‌ని ఆకాంక్షిస్తున్నాను.