‘స్పిరిట్’ నుంచి న్యూ ఇయర్ బ్లాస్ట్: ప్రభాస్ ‘రూత్ లెస్ కాప్’ లుక్ అరాచకం!

Spread the love

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘స్పిరిట్’ (Spirit) నుండి న్యూ ఇయర్ సందర్భంగా అదిరిపోయే అప్‌డేట్ వచ్చింది.అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు.ఈ పోస్టర్‌లో ప్రభాస్ మునుపెన్నడూ లేని విధంగా ఒక పవర్‌ఫుల్ & రూత్ లెస్ కాప్ (కఠినమైన పోలీస్) అవతారంలో కనిపిస్తూ ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్నారు.దర్శకుడు సందీప్ వంగా మార్క్ ఇంటెన్సిటీ ఈ లుక్‌లోనే స్పష్టంగా కనిపిస్తోంది. ప్రభాస్ సరసన నేషనల్ క్రష్ త్రిప్తి డిమ్రీ హీరోయిన్‌గా నటిస్తుండగా, వీరిద్దరి కాంబినేషన్ ఈ సినిమాలో ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.పోస్టర్‌లో వీరిద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీ సినిమాపై అంచనాలను రెట్టింపు చేసింది.ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, వివేక్ ఒబెరాయ్ వంటి హేమాహేమీలు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.ఈ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నారు. ఈ ఫస్ట్ లుక్ చూస్తుంటే వెండితెరపై ప్రభాస్ తన నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్‌తో బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయడం ఖాయమనిపిస్తోంది.

View this post on Instagram

A post shared by Prabhas (@actorprabhas)