తెలంగాణ ప్రజలందరికీ సీఎం రేవంత్ రెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. సకలజన సంక్షేమ రాష్ట్రంగా…సమస్త అభివృద్ధికి కేంద్రంగా…ప్రజాస్వామ్య స్ఫూర్తికి ఆదర్శంగా…నాలుగు కోట్ల ప్రజల సహకారంతో… నవ వసంతాన తెలంగాణ గొప్ప విజయాలను సాధించాలని కోరుకుంటూ… ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అంటూ సీఎం సోషల్ మీడియా ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. ఇక బేగంపేటలోని IAS ఆఫీసర్స్ అసోసియేషన్ క్లబ్ లో నూతన సంవత్సర వేడుకల్లో సీఎం రేవంత్ పాల్గొన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సీనియర్ IAS అధికారులు, అసోసియేషన్ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని లోక్ భవన్ లో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.