కొత్త సంవత్సర వేళ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

Spread the love

కొత్త  సంవత్సరంలోకి ప్రవేశించిన వేళ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని 5 రకాల భూములను 22ఏ జాబితా నుంచి తొలగించింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ కొత్త ఏడాది మొదటి సంతకం చేశారు. రాష్ట్రంలోని భూ యజమానులకు నూతన సంవత్సర కానుకగా 5 రకాల భూములను 22ఏ జాబితా నుంచి తొలగిస్తూ ఫైల్‌పై సంతకం చేయడం సంతోషాన్ని కలిగించిందని అనగాని పేర్కొన్నారు. మిగిలిన 4 రకాల భూములపై త్వరలో జీవోఎంలో చర్చించి నిర్ణయం తీసుకోబడుతుందని  భూ యజమానులు ఇబ్బందులు పడకుండా 22 ఎ జాబితా నుంచి  ప్రైవేట్ భూములను పూర్తిగా తొలగించిన విజనరీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నానని ఆయన ‘ఎక్స్’ లో పేర్కొన్నారు.