అడివి శేష్ ‘డెకాయిట్’ నుండి న్యూ ఇయర్ అప్‌డేట్!

Spread the love

టాలీవుడ్ యంగ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ యాక్షన్ డ్రామా ‘డెకాయిట్’ నుండి క్రేజీ అప్‌డేట్ వచ్చింది. నూతన సంవత్సర సందర్భాన్ని పురస్కరించుకుని, చిత్ర బృందం ప్రస్తుతం ఒక ఎత్తైన కొండ ప్రాంతంలో సినిమా క్లైమాక్స్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు శేష్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.షానీల్ డియో దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో అడివి శేష్ సరసన స్టార్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ నటిస్తుండగా, బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్ విలన్‌గా అలరించనున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, పోస్టర్లు సినిమాపై భారీ అంచనాలను పెంచగా, క్లైమాక్స్ ఎపిసోడ్ ఎంతో భారీగా, హై-వోల్టేజ్ యాక్షన్‌తో ఉండబోతోందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని సుప్రియ యార్లగడ్డ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా ముగించి, సమ్మర్ కానుకగా విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.