మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో జాతీయ సమగ్రతకు భంగం కలిగించే షాకింగ్ ఘటన వెలుగుచూసింది.నాయిగావ్ సమీపంలోని చిన్చోటి ప్రాంతంలో గల ఒక దుర్గామాత ఆలయం ఎదురుగా ఉన్న సెలూన్‌లో దేశ వ్యతిరేక పాటలు ప్లే చేసినందుకు అబ్దుల్ రెహమాన్ సద్రుద్దీన్ షా (25) అనే యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సబ్-ఇన్‌స్పెక్టర్ పంకజ్ కిల్జే, సదరు సెలూన్ నుండి ‘కశ్మీర్ బనేగా పాకిస్థాన్’ అనే అత్యంత రెచ్చగొట్టే పాట పెద్ద శబ్దంతో వినిపిస్తుండటాన్ని గుర్తించారు.కాగా నిందితుడు తన మొబైల్ ద్వారా యూట్యూబ్‌లో ఈ పాటను బ్లూటూత్ స్పీకర్లకు కనెక్ట్ చేసి ప్లే చేస్తున్నట్లు విచారణలో తేలింది.ఆలయ సమీపంలో ఇటువంటి రెచ్చగొట్టే చర్యలకు పాల్పడటంతో స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.పోలీసులు నిందితుడిపై బీఎన్ఎస్ (BNS) సెక్షన్ 197(1)(d) కింద కేసు నమోదు చేసి, మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ఇలాంటి చర్యలపై కఠినంగా వ్యవహరిస్తామని పోలీసులు హెచ్చరించారు.