కేంద్ర ఎన్నికల సంఘంతో జనసేన ప్రతినిధుల భేటీ

Spread the love

ఓటర్ లిస్టు, ఎలక్షన్  ప్రక్రియలో చేయాల్సిన మార్పులు చేర్పులు, తీసుకురావాల్సిన సంస్కరణల గురించి వివిధ రాజకీయ పార్టీలతో సమావేశమవుతున్న సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ (ఈసీ) తాజాగా జనసేన పార్టీ ప్రతినిధులతో సమావేశమైంది. ఢిల్లీలోని ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్, మిగతా కమిషనర్లు సుఖీబీర్ సింగ్ సంధు, వివేక్ జోషీలు జనసేన ప్రతినిధులు ఇ. ప్రతాప్ కుమార్, ఆర్ఎంవీ సుమంత్ లతో సమావేశమై పలు  అంశాలపై వారి సలహాలు, సూచనలు తీసుకున్నారు. ఈ సందర్భంగా మొత్తం ఏడు అంశాలపై జనసేన సూచనలు, సలహాలను వ్రాతపూర్వకంగా అందించింది. వివిధ రాష్ట్రాల్లో ‘ఎస్ఐఆర్’తో చేపట్టిన ఓటర్ల లిస్ట్  ప్రక్షాళన.. ఈసీ  రాజ్యాంగ నిబద్ధతను, స్వేచ్చగా, నిజాయతీగా ఎన్నికలు నిర్వహించే విషయంలో ఉన్న చిత్తశుద్ధిని చాటి చెబుతోంది. ఆంధ్రప్రదేశ్లోనూ అలాంటి కార్యక్రమం చేపడితే ప్రజాస్వామ్య ప్రక్రియపై ప్రజలకున్న నమ్మకాన్ని పటిష్టం  చేయడానికి దోహదం చేస్తుంది. అలాగే ప్రతి పౌరుడికీ ఎన్నికల ప్రక్రియలో పాల్గొనేందుకు బాటలు వేస్తుందని విశ్వసిస్తున్నాట్లు  జనసేన విజ్ఞప్తి చేసింది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ను స్వాగతిస్తున్నామని జనసేన పార్టీ కేంద్ర ఎన్నికల సంఘానికి తెలిపింది. ఆంధ్రప్రదేశ్లోనూ ఈ ప్రక్రియను సాధ్యమైనంత త్వరగా మొదలుపెట్టాలని కోరింది.