మస్క్ దాతృత్వం: ₹900 కోట్ల విలువైన టెస్లా షేర్ల విరాళం!

Spread the love

టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ తన ‘సంవత్సరాంతపు పన్ను ప్రణాళిక’లో భాగంగా సుమారు 2,10,699 టెస్లా షేర్లను దాతృత్వ కార్యక్రమాల కోసం విరాళంగా ఇచ్చారు. 2025 డిసెంబర్ 30న జరిగిన ఈ బదిలీ విలువ ప్రస్తుత మార్కెట్ ప్రకారం సుమారు 100 మిలియన్ డాలర్లు (₹900 కోట్లు) ఉంటుందని అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ (SEC) ఫైలింగ్‌లో వెల్లడైంది.అయితే, ఈ షేర్లను ఏ సంస్థలకు అందించారనే విషయాన్ని మస్క్ రహస్యంగా ఉంచారు ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన మస్క్ (నికర ఆస్తి సుమారు $619 బిలియన్లు), ఇలా భారీ మొత్తంలో షేర్లను విరాళంగా ఇవ్వడం ఇది మొదటిసారి కాదు,గతంలో ఆయన బిలియన్ల కొద్దీ డాలర్లను తన ‘మస్క్ ఫౌండేషన్’ ద్వారా వివిధ సామాజిక కార్యక్రమాలకు వెచ్చించారు.

టెస్లా భవిష్యత్తుపై మస్క్ ఒక స్పష్టమైన వ్యూహంతో ఉన్నారు.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), రోబోటిక్స్ , రోబోటాక్సీ రంగాల్లో టెస్లాను అగ్రగామిగా నిలపాలంటే తనకు కంపెనీలో కనీసం 25 శాతం ఓటింగ్ అధికారం ఉండాలని ఆయన పట్టుబడుతున్నారు.ఈ క్రమంలోనే 2025 నవంబర్‌లో టెస్లా వాటాదారులు ఆయనకు చారిత్రాత్మకమైన 1 ట్రిలియన్ డాలర్ల వేతన ప్యాకేజీని ఆమోదించారు.ఈ ఒప్పందం ప్రకారం, నిర్ణీత లక్ష్యాలను చేరుకుంటే మస్క్ వాటా ప్రస్తుత 13 శాతం నుండి 29 శాతానికి పెరుగుతుంది. 2026 నాటికి విస్తృత స్థాయిలో రోబోటాక్సీలను ప్రవేశపెట్టడం , ‘ఆప్టిమస్’ హ్యూమనాయిడ్ రోబోట్ల తదుపరి వెర్షన్లను తీసుకురావడమే లక్ష్యంగా మస్క్ అడుగులు వేస్తున్నారు.