26 ఏళ్లలో ఎన్నడూ లేనివిధంగా విద్యుత్ ఛార్జీలను  ట్రూడౌన్ చేశాం :-మంత్రి గొట్టిపాటి…!

Spread the love

రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (APERC) ఏర్పడిన 26 ఏళ్ల చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా, విద్యుత్ ఛార్జీలను ట్రూడౌన్ చేసి కూటమి ప్రభుత్వం రికార్డు సృష్టించిందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రకటించారు.2019-20 నుండి 2023-24 మధ్య కాలానికి సంబంధించి వినియోగదారులపై పడాల్సిన ₹3,398 కోట్ల ట్రూఅప్ భారాన్ని ప్రజలపై వేయకుండా ప్రభుత్వమే భరిస్తుందని ఆయన స్పష్టం చేశారు.గత వైసీపీ ప్రభుత్వం ఐదేళ్ల కాలంలో ₹32,166 కోట్ల మేర విద్యుత్ ఛార్జీలను పెంచి ప్రజలపై మోపిన భారంతో పోలిస్తే, తమ ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు వ్యయాన్ని తగ్గించి చౌకగా విద్యుత్ అందించడమే లక్ష్యంగా పనిచేస్తోందని తెలిపారు. జగన్ ప్రభుత్వ హయాంలో జరిగిన లోపాల వల్ల విద్యుత్ శాఖ ఇంకా ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ, సామాన్యుడిపై రూపాయి భారం పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని మంత్రి వివరించారు. ఈ నిర్ణయం రాష్ట్రంలోని లక్షలాది మంది విద్యుత్ వినియోగదారులకు నూతన సంవత్సర కానుకగా నిలవనుంది.