తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్‌పై చేస్తున్న విమర్శలపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఘాటుగా స్పందించారు.కేసీఆర్‌ను తిడుతుంటే ఆయన బిడ్డగా తన రక్తం మరుగుతోందని, తెలంగాణ రాష్ట్రం ఆయన త్యాగం , పోరాట ఫలితమని ఆమె గుర్తు చేశారు. అసెంబ్లీలో కేసీఆర్ స్వయంగా వచ్చి ప్రత్యర్థుల నోళ్లు మూయించాలని, కేవలం ‘బబుల్ షూటర్ల’ తో సమాధానం చెప్పిస్తే ప్రజలకు అర్థం కాదని ఆమె వ్యాఖ్యానించారు.ఈ బబుల్ షూటర్ల వల్లే పార్టీకి ట్రబుల్స్ వచ్చాయని, అక్రమాలకు పాల్పడిన వారికే డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పదవులు ఇచ్చారని ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు.ఇప్పటికైనా కేసీఆర్ సభకు వచ్చి పోరాడాలని, లేని పక్షంలో ఆ భగవంతుడు కూడా పార్టీని కాపాడలేడంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కవిత చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీశాయి.
కేసీఆర్ అసెంబ్లీకి రావాల్సిందే, లేకపోతే దేవుడు కూడా పార్టీని కాపాడలేడు: కల్వకుంట్ల కవిత