కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ ,రాహుల్ గాంధీ ఫిబ్రవరి 2న ఆంధ్రప్రదేశ్లో పర్యటించనున్నారు.ఈ మేరకు అనంతపురం జిల్లా శింగనమల మండలంలోని బండ్లపల్లి గ్రామాన్ని వారు సందర్శించనున్నారు.దేశవ్యాప్తంగా అమలవుతున్న ఉపాధి హామీ పథకానికి కేంద్ర ప్రభుత్వం పేరు మార్పు చేయాలని చూస్తుండటాన్ని నిరసిస్తూ, ఆ పథకం పురుడుపోసుకున్న బండ్లపల్లి నుండే కాంగ్రెస్ పార్టీ భారీ ఆందోళనకు పిలుపునిచ్చింది.ఉపాధి హామీ పథకానికి ఉన్న చారిత్రక ప్రాధాన్యతను కాపాడాలని,పేదల పొట్ట కొట్టే చర్యలను సహించబోమని కాంగ్రెస్ అగ్రనేతలు ఈ సందర్భంగా స్పష్టం చేయనున్నారు.ఈ పర్యటనతో ఏపీలో కాంగ్రెస్ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపడమే కాకుండా, కేంద్ర ప్రభుత్వ వైఖరిపై దేశవ్యాప్త చర్చకు తెరలేపాలని పార్టీ వ్యూహరచన చేస్తునాలు తెలుస్తోంది.