లిమిటెడ్ ఓవర్ల సిరీస్ కోసం త్వరలో భారత పర్యటనకు న్యూజిలాండ్ రానుంది. ఈనెల 11 నుంచి మూడు వన్డేల సిరీస్, 21 నుంచి టీ20 సిరీస్ ప్రారంభమవుతాయి. కాగా, ఈ సిరీస్ ల కోసం అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ నేడు వన్డే జట్టును ప్రకటించింది. శ్రేయస్ అయ్యర్ జట్టులోకి పునరాగమనం చేయనున్నాడు. బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ నుంచి ఫిట్నెస్ క్లియరెన్స్ వస్తేనే అతను మ్యాచ్లు ఆడతాడు. రిషబ్ పంత్, యశస్వి జైస్వాల్ ను జట్టులో కొనసాగించారు. రుతురాజ్ గైక్వాడ్ ను మాత్రం ఎంపిక చేయలేదు. దేశవాళీల్లో సత్తా చాటుకున్న సీనియర్ పేసర్ మహ్మద్ షమికి కూడా నిరాశే ఎదురైంది. వన్డే సిరీస్ తర్వాత జరిగే టీ20లకు భారత జట్టును ఇప్పటికే ఎంపిక చేశారు. వచ్చే నెలలో ఆరంభమయ్యే టీ20 ప్రపంచకప్ కోసం ఎంపిక చేసిన జట్టునే ఆ సిరీస్ లో కొనసాగించనున్నారు.
న్యూజిలాండ్ తో వన్డేలకు భారత జట్టు:
శుభ్ మాన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, మహ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా, ప్రసీద్ కృష్ణ, కుల్దీప్ యాదవ్, రిషబ్ పంత్, నితీశ్ కుమార్ రెడ్డి, అర్ష్ దీప్ సింగ్, యశస్వి జైస్వాల్.