‘భీమవరం బీట్’లో రఘురామ కృష్ణరాజు మాస్ స్టెప్పులు!

Spread the love

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు రాజకీయ తెరపైనే కాదు, ఇప్పుడు వెండితెర తరహా మ్యూజిక్ వీడియోలలోనూ తన సందడి మొదలుపెట్టారు. ప్రముఖ పాప్ సింగర్ స్మిత సంక్రాంతి కానుకగా రూపొందించిన ‘భీమవరం బీట్’ అనే వీడియో సాంగ్‌లో ఆయన స్పెషల్ అప్పియరెన్స్‌తో అందరినీ ఆశ్చర్యపరిచారు.ర్యాపర్ నోయల్‌తో కలిసి స్మిత ఆలపించిన ఈ హై-ఎనర్జీ సాంగ్‌లో రఘురామ కృష్ణరాజు వేసిన డ్యాన్స్ స్టెప్పులు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.విజయ్ బిన్నీ దర్శకత్వంలో పక్కా పండగ వాతావరణం ప్రతిబింబించేలా తెరకెక్కిన ఈ పాటలో ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలోని పాపులర్ స్టెప్పులను కూడా అనుకరించడం విశేషం. పశ్చిమ గోదావరి జిల్లా సంస్కృతిని, సంక్రాంతి సంబరాలను మేళవిస్తూ రూపొందిన ఈ పాట విడుదలైన కొద్ది గంటల్లోనే యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లోకి దూసుకెళ్లింది.రాజకీయ నాయకుడిగా బిజీగా ఉంటూనే, ఇలా కళాత్మక రంగంలో మెరవడం ద్వారా ఆయన తనలోని మరో ఉత్సాహభరితమైన కోణాన్ని ఆవిష్కరించారు.ఈ సంక్రాంతి సీజన్‌లో యువతను ఊరూరూ ఊగించేలా ‘భీమవరం బీట్’ నిలుస్తోంది.