కేబీసీ వేదికపై బిగ్ బీ కన్నీళ్లు…17వ సీజన్ ఫినాలేలో అమితాబ్ భావోద్వేగం!

Spread the love

భారతీయ టెలివిజన్ చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించిన ‘కౌన్ బనేగా కరోడ్పతి’ (KBC) 17వ సీజన్ ముగింపు సందర్భంగా అమితాబ్ బచ్చన్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.గత 25 ఏళ్లుగా ఈ షోతో కొనసాగిస్తున్న విడదీయరాని అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ, గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్‌లో బిగ్ బీ కన్నీళ్లు పెట్టుకోవడం కోట్లాదిమంది అభిమానులను కలచివేసింది.తన జీవితంలో మూడింట ఒక వంతు సమయం ఈ వేదికపైనే గడిచిందని,సామాన్యుల జ్ఞానానికి సలాం చేస్తూ సాగిన ఈ ప్రయాణం తనకు ఎంతో నేర్పిందని ఆయన ఆవేదనగా పేర్కొన్నారు.ఈ సీజన్ ముగింపులో ఆయన చూపిన భావోద్వేగం చూస్తుంటే.. బహుశా ఇదే అమితాబ్ చివరి కేబీసీ సీజన్ కాబోతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ఇక ఫినాలే ఎపిసోడ్‌లో అగస్త్య నంద మెరుపులు, కికు శారదా కామెడీతో పాటు అమితాబ్ ప్రత్యేక సంగీత ప్రదర్శన హైలైట్‌గా నిలవనున్నాయి.కేబీసీకి ప్రాణవాయువులా నిలిచిన బిగ్ బీ ప్రయాణం ఇక్కడితో ఆగిపోతుందా లేదా అనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.