జమ్మూకశ్మీర్ భారత్‌దే..పీవోకేను విలీనం చేయాలి: బ్రిటన్ ఎంపీ బాబ్ బ్లాక్‌మన్ 

Spread the love

బ్రిటన్ కన్జర్వేటివ్ పార్టీ సీనియర్ ఎంపీ బాబ్ బ్లాక్‌మన్ జమ్మూకశ్మీర్ అంశంపై భారత్‌కు మరోసారి తన గట్టి మద్దతును ప్రకటించారు. జైపూర్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడిన ఆయన, పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (PoK) ప్రాంతాలను వెంటనే భారత్‌లో విలీనం చేయాలని డిమాండ్ చేశారు.ఆర్టికల్ 370 రద్దును సమర్థిస్తూ, ఈ నిర్ణయాన్ని కశ్మీరీ పండితుల వలసలు జరిగిన 1992లోనే తీసుకుని ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని అభిప్రాయపడ్డారు.పీవోకే కేంద్రంగా పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోందని మండిపడ్డ ఆయన,పహల్గాం దాడి నేపథ్యంలో భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ సరైన చర్యేనని సమర్థించారు.సరిహద్దుల్లో ఉగ్రవాద కార్యకలాపాలు కాల్పుల విరమణ ఒప్పందాల ఉల్లంఘనకు దారి తీస్తాయని, దీనివల్ల పాకిస్థానే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు. దశాబ్దాలుగా కశ్మీర్ విషయంలో భారత్ వైఖరిని బలపరుస్తున్న బ్లాక్‌మన్ వ్యాఖ్యలు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో ప్రాధాన్యత సంతరించుకున్నాయి.