2020 ఢిల్లీ అల్లర్ల కుట్ర కేసులో అరెస్టయిన ఉమర్ ఖాలిద్, శర్జీల్ ఇమామ్‌లకు సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది.తాజగా విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం, వీరిద్దరికీ బెయిల్ ఇచ్చేందుకు నిరాకరిస్తూ కీలక తీర్పు వెలువరించింది.ఈ కేసులో వీరి పాత్రపై బలమైన ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని, ఇతర నిందితులతో పోలిస్తే వీరిపై ఉన్న అభియోగాలు తీవ్రమైనవని ధర్మాసనం స్పష్టం చేసింది.అయితే, ఇదే కేసులో నిందితులుగా ఉన్న గుల్ఫిషా ఫాతిమా, మీరాన్ హైదర్ సహా మరో ఐదుగురికి మాత్రం కోర్టు బెయిల్ మంజూరు చేస్తూ ఊరటనిచ్చింది పౌరసత్వ సవరణ చట్టం (CAA) వ్యతిరేక నిరసనల సమయంలో చెలరేగిన ఈ హింసలో 53 మంది మరణించగా, వీరిపై చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (UAPA) కింద కేసులు నమోదయ్యాయి.ఢిల్లీ హైకోర్టు బెయిల్ నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ వీరు సుప్రీంను ఆశ్రయించగా, తాజాగా వెలువడిన ఈ తీర్పు రాజకీయ మరియు న్యాయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ నిర్ణయంతో ఖాలిద్, శర్జీల్ మరికొంత కాలం జైలులోనే గడపాల్సి ఉంటుంది.