దేశ రాజధాని ఢిల్లీలో ప్రతి ఏటా అత్యంత వైభవంగా జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకలను (జనవరి 26) ప్రత్యక్షంగా వీక్షించాలనుకునే వారికోసం కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ టికెట్ల అమ్మకాలను ప్రారంభించింది.రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన అధికారిక వెబ్‌సైట్ aamantran.mod.gov.in ద్వారా ప్రజలు తమ టికెట్లను బుక్ చేసుకోవచ్చు.త్రివిధ దళాల కవాతు, అత్యాధునిక ఆయుధాల ప్రదర్శన మరియు వివిధ రాష్ట్రాల శకటాల ప్రదర్శనను చూడాలనుకునే వారు ముందుగానే రిజిస్ట్రేషన్ చేసుకోవడం తప్పనిసరి.కేవలం గణతంత్ర దినోత్సవానికే కాకుండా, జనవరి 28న జరిగే బీటింగ్ రిట్రీట్ రిహార్సల్, జనవరి 29న జరిగే ప్రధాన బీటింగ్ రిట్రీట్ పరేడ్లకు కూడా టికెట్లు అందుబాటులో ఉన్నాయి.భద్రతా కారణాల దృష్ట్యా, టికెట్ కొనుగోలు చేసేటప్పుడు అప్‌లోడ్ చేసిన ఒరిజినల్ ఐడీ కార్డును వెంట తీసుకెళ్లడం & అందులో పూర్తి చిరునామా ఉండటం అత్యంత ముఖ్యం.
టికెట్ ధరలు & బుకింగ్ వివరాలు:
- గణతంత్ర దినోత్సవ పరేడ్ (జనవరి 26): రూ. 100 (కేటగిరీ 1) మరియు రూ. 20 (కేటగిరీ 2).
- బీటింగ్ రిట్రీట్ పరేడ్ (జనవరి 29): రూ. 100.
- బీటింగ్ రిట్రీట్ ఫుల్ డ్రెస్ రిహార్సల్ (జనవరి 28): రూ. 20.
- బుకింగ్ విధానం: ‘ఆమంత్రన్’ (Aamantran) పోర్టల్‌లో పేరు, మొబైల్ నెంబర్, పుట్టిన తేదీ మరియు అడ్రస్ ప్రూఫ్‌తో లాగిన్ అయి టికెట్లు పొందవచ్చు. ఒక్కో యూజర్ గరిష్టంగా 10 టికెట్ల వరకు బుక్ చేసుకునే అవకాశం ఉంది