డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఓఎన్జీసీ డ్రిల్ సైట్ నుంచి గ్యాస్ లీకైంది. మలికిపురం మండలం ఇరుసుమండలో సుమారు 2 గంటలుగా గ్యాస్ పైకి వెదజిమ్ముతోంది. దీంతో మంటలు ఎగసిపడ్డాయి. ఘటనాస్థలాన్ని తహసీల్దార్ శ్రీనివాసరావు పరిశీలించారు. దీనిపై ఓఎన్జీసీ ఉన్నతాధికారులకు తెలియజేసినట్లు తెలిపారు. ఆ సంస్థ టెక్నీకల్ ఎక్స్పర్ట్స్ ఘటనా స్థలికి చేరుకుంటున్నట్లు తెలిపారు. ఈ ఘటనతో స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు.