దేశవ్యాప్తంగా కె.జి.ఎఫ్ చిత్రాలతో విశేష గుర్తింపు తెచ్చుకున్న కన్నడ నటుడు ‘యశ్’ హీరోగా మలయాళ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ ‘టాక్సిక్’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ‘ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’ అనేది ట్యాగ్ లైన్. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ మూవీ నుంచి నేడు హీరో ‘యశ్’ పుట్టిన రోజు సందర్భంగా సర్ప్రైజ్ ను మూవీ టీమ్ అభిమానులతో పంచుకుంది. యశ్ లుక్ ను విడుదల చేస్తూ గ్లింప్స్‌ను విడుదల చేసింది.
ఇందులో యశ్ ‘రయా’ పాత్రలో నటిస్తున్నట్లు తెలుపుతూ పవర్ఫుల్ పోస్టర్ ను పంచుకుంది. ఈ వ్యక్తి చాలా ప్రమాదకరం అంటూ పాత్రను పరిచయం చేస్తూ వీడియోను షేర్ చేసింది. భారీ అంచనాల మధ్య ఈ ఏడాది మార్చి 19న ప్రేక్షకుల ముందుకురానుంది. ఇక ఇందులో యశ్‌తో పాటు అయిదుగురు హీరోయిన్లు కీలక పాత్రలు పోషిస్తున్నారు. కియారా, హ్యుమా ఖురేషీ, నయనతార, తారా సుతారియా, రుక్మిణి వసంత్ నటిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన వీరి ఫస్ట్‌లుక్ పోస్టర్లకు మంచి ఆదరణ లభించింది.