ఇజ్రాయెల్ ప్రధానితో ఫోన్ లో మాట్లాడిన భారత ప్రధాని మోడీ

Spread the love

భారత ప్రధాని నరేంద్ర మోడీ ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమెన్ నెతన్యాహు ఫోన్ లో సంభాషించుకున్నారు. కాగా, ఈ క్రమంలో పరస్పరం నూతన  సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఇక ఉగ్రవాదంపై పోరులో రెండు దేశాలు కూడా కలిసి తమ నిబద్ధతను పునరుద్ఘాటించాయి. ఇక ఈ విషయాన్ని ప్రధాన మంత్రి మోడీ సోషల్ మీడియా ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. నా స్నేహితుడు, ప్రధాన మంత్రి బెన్యామిన్ నెతన్యాహుతో మాట్లాడటం మరియు వారికి, అలాగే ఇజ్రాయెల్ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడం సంతోషంగా ఉంది. రాబోయే ఏడాదిలో భారత-ఇజ్రాయెల్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే మార్గాల గురించి మేము చర్చించాము. మేము ప్రాంతీయ పరిస్థితులపై కూడా అభిప్రాయాలను పంచుకున్నాము మరియు మరింత పట్టుదలతో ఉగ్రవాదాన్ని ఎదుర్కోవాలనే మా ఉమ్మడి సంకల్పాన్ని పునరుద్ఘాటించామని ఆయన తన పోస్ట్ లో పేర్కొన్నారు.