ఇప్పుడు అతను ఏం చేయబోతున్నాడు..?టాక్సిక్ తో దురంధర్ ను డీ కొడతాడా..?

Spread the love

నిన్నే’రాకింగ్ స్టార్’ యష్ పుట్టినరోజు సందర్బంగా అతని నెక్స్ట్ సినిమా టాక్సిక్ నుంచి ఫస్ట్ లుక్ ప్రోమో వదిలారు… ఆమ్మో అది చుస్తే ఒక్క సారి మనకి సందీప్ రెడ్డి వంగ గుర్తుకు వచ్చాడు కదా! మొన్నే ప్రభాస్ స్పిరిట్ ఫస్ట్ లుక్ పోస్టర్ లో డార్లింగ్ ని ఒక చేతిలో మందు బాటిల్ ఇంకా హీరోయిన్ tripti సిగరెట్ వెలిగిస్తున్నటు చూపించారు… ఇదే మాస్ ఊర మాస్ అనుకుంటే, టాక్సిక్ ప్రోమో చుస్తే, ఇంకేం అనాలో కదా…

ఆ ప్రోమో లో ఒక స్మశానం లో కొంత మంది గ్యాంగ్స్టర్స్ తమ హీరో తిరిగి వస్తాడని మాట్లాడుకుంటూ ఉంటారు… కానీ బయట ఒక కార్ లో యష్ మంచి రొమాంటిక్ కథ ముగించి, స్టైలిష్ గా బయటికి అడుగుపెట్టి డాడీస్ హోమ్ అంటాడు. ఆమ్మో మరి ఇంత బోల్డ్ ఆ అంటే, ఎస్, సినిమా టాగ్ లైన్ ‘ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’ లానే ఇది పెద్దల కోసమే సినిమా ఏమో… ఇక ఈ సినిమా డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ కావడం తో అటు సందీప్ రెడ్డి వంగ ట్విట్టర్ లో “TOXIC teaser just knocked me out.

Style. Attitude. Chaos.Happy Birthday Yash అంటూ పోస్ట్ చేసి షాక్ అయ్యాడు… అలానే రామ్ గోపాల్ వర్మ డైరెక్టర్ గీతూ పిక్ షేర్ చేసి After seeing the టాక్సిక్ ప్రోమో , it is the ultimate symbol of Women Empowerment ..No Male director is Man enough in comparison to this Woman .. I still can’t believe she shot this ” అని రాసుకొచ్చాడు…ఇది చాలదు ఇద్దరు డైరెక్టర్స్ ఎలా షాక్ అయ్యారో చెప్పడానికి… ఇంకా ఈ సినిమా మార్చ్ లో రిలీజ్ అవుతుండడం తో మన రణ్వీర్ సింగ్ ధురంధర్ సీక్వెల్ కి కరెక్ట్ పోటీ అంటున్నారు… చూద్దాం!