ఈ సంవత్సరం పూర్తవనున్న 73 మంది రాజ్యసభ ఎంపీల పదవీ కాలం  

Spread the love

ఈ సంవత్సరం రాజ్యసభలో 73 మంది ఎంపీలు  పదవీవిరమణ చేయనున్నారు. దీనిపై రాజ్యసభ సెక్రటేరియట్ ఇటీవల  బులిటెన్ విడుదల చేసింది. అత్యధికంగా ఉత్తరప్రదేశ్  నుంచి 10 మంది, మహారాష్ట్ర నుంచి 7, తమిళనాడు నుంచి 6, పశ్చిమ బెంగాల్5, బిహార్  నుంచి 5, ఏపీ 4, ఒడిశా 4, గుజరాత్ 4, కర్ణాటక 4, అస్సాం 3, మధ్యప్రదేశ్ 3, రాజస్థాన్ 3, తెలంగాణ 2,ఛత్తీస్ ఘడ్ 2, హరియాణా2, జార్ఖండ్ 2 హిమాచల్ ప్రదేశ్, మణిపుర్, మేఘాలయ, మిజోరం, అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్  నుంచి ఒక్కొక్క స్థానం చొప్పున ఖాళీ అవనున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్, తెలంగాణాల నుంచి  పలువురు సభ్యులు పదవీ విరమణ చేయనున్నారు. అందులో వైసీపీ ఎంపీలు అయోధ్యరామిరెడ్డి, పరిమళ్ నత్వానీ, పిల్లి సుభాష్ చంద్రబోస్ తో పాటు, టీడీపీ ఎంపీ సానా సతీష్ బాబు ఈ లిస్ట్ లో  ఉన్నారు. ఈసారి ఏపీ నుంచి నాలుగు స్థానాలూ కూటమికి దక్కనున్నాయి. తెలంగాణ నుంచి బీ.ఆర్.ఎస్  సభ్యుడు కేఆర్ సురేష్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి కేశవరావు రాజీనామాతో జరిగిన ఉప ఎన్నికలో ఎన్నికైన సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ పదవీ విరమణ చేయనున్నారు.