భారత డైరీ రంగంలో విశేష సేవలకుగాను హెరిటేజ్ ఫుడ్స్ వైస్ ఛైర్ పర్సన్, మేనేజింగ్ డైరెక్టర్ నారా భువనేశ్వరికి ‘అవుట్‌స్టాండింగ్ డెయిరీ ప్రొఫెషనల్’ అవార్డు లభించింది. డైరీ రంగంలో నాణ్యత, ఆధునికీకరణ,రైతు సంక్షేమం మరియు స్థిరమైన అభివృద్ధికి ఆమె అందించిన సేవలకు ఈ గౌరవం లభించింది. ఇక ఈ అవార్డు దక్కడం పట్ల ఆమె స్పందిస్తూ ఇండియన్ డెయిరీ అసోసియేషన్, సౌత్ జోన్ నుండి ‘అవుట్‌స్టాండింగ్ డెయిరీ ప్రొఫెషనల్’ అవార్డును అందుకోవడం తనకు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు. ఈ గుర్తింపునిచ్చిన సంస్థకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఈ అవార్డును ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వేలాది మంది పాల ఉత్పత్తిదారులకు (రైతులకు) అంకితం చేస్తున్నట్లు భువనేశ్వరి పేర్కొన్నారు. భారతదేశపు పాడి పరిశ్రమ అభివృద్ధి మరియు శ్రేయస్సు కోసం నిరంతరం కృషి చేస్తానని ఈ సందర్భంగా మరోసారి పునరుద్ఘటించారు.