దుర్గ గుడి లో భక్తులకు కరెంట్ షాక్.. భక్తులు క్షేమం 

Spread the love

దుర్గ గుడి లో మరో నిర్లక్ష్యకరమైన ఘటన చోటుచేసుకుంది. విజయవాడ ఇంద్రకిలాద్రి ఉచిత ప్రసాద వితరణ కేంద్రం దగ్గర భక్తులకు కరెంటు షాక్ తగిలింది. దీంతో భక్తులు కంగారు పడ్డారు.  భక్తుల కేకలు విన్న ఆలయ సిబ్బంది వెంటనే స్పందించి మెయిన్ స్విచ్ ఆఫ్ చేయడంతో పెను ప్రమాదం తప్పింది.ఆలయ ఎలక్ట్రీషియన్, అధికారులు ప్రసాద వితరణ కేంద్రం వద్ద ఉన్న విద్యుత్ తీగలను పరిశీలించారు. సంక్రాంతి సెలవులు కావడంతో ఈరోజు  భక్తుల రద్దీ అధికంగా ఉంది. ఈ నేపథ్యంలో భక్తులకు విద్యుత్ షాక్ తగలడం కలకలం రేపింది. అయితే, విద్యుత్ షాక్ కారణంగా భక్తులు ఎవరూ గాయపడలేదని, మరమ్మతులు పూర్తి చేసిన తర్వాత విద్యుత్ సరఫరాను పునరుద్ధరిస్తామని ఆలయ అధికారులు తెలిపారు. అమ్మవారి గుడిలో వరుసగా అపచారాలు జరుగుతుండడం భక్తులను కలవరపెడుతోంది. గడిచిన 15 రోజుల్లో మూడు వరుస ఘటనలు జరగడం శోచనీయం.  అమ్మవారి ఆలయం లో పవర్ కట్,అమ్మవారికి నిర్వహించే పూజలో ఉపయోగించే పాలల్లో పురుగులు కనిపించడం వంటి ఘటనలపై విమర్శలు వస్తున్నాయి.