భారత్ న్యూజిలాండ్ జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు వడోదరా లోని బీసీఏ స్టేడియం వేదికగా జరిగిన మొదటి వన్డేలో భారత్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించి ఈ ఏడాదిని ఘనంగా ప్రారంభించింది.మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 300 పరుగులు చేసింది. డేరిల్ మిచెల్ 84 (71 బాల్స్ లో 5×4, 3×6) హాఫ్ సెంచరీతో న్యూజిలాండ్ మంచి స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. హెన్రీ నికోలస్ 62 (69; 8×4), డేవాన్ కానట్లే 56 (67; 6×4, 1×6) హాఫ్ సెంచరీలతో రాణించారు. క్రిస్టియన్ క్లార్క్ 24 నాటౌట్ (17; 3×4) పరుగులు చేశాడు. ఇక భారత బౌలర్లలో హార్షిత్ రాణా, మహ్మద్ సిరాజ్, ప్రసీద్ కృష్ణ 2 వికెట్లు చొప్పున పడగొట్టారు. కుల్దీప్ యాదవ్ ఒక వికెట్ తీశారు.
అనంతరం టార్గెట్ ను భారత్ 6 వికెట్లు కోల్పోయి 49 ఓవర్లలో ఛేజ్ చేసింది. విరాట్ కోహ్లీ 93 (91; 8×4, 1×6) కొద్దిలో సెంచరీ మిస్ అయ్యాడు. అయితే భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. శుభ్ మాన్ గిల్ 56 (71; 3×4, 2×6), శ్రేయాస్ అయ్యర్ 49 (47; 4×4, 1×6) లతో కలిసి కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాడు. వీరు ఈ వికెట్లు పడిన తర్వాత హార్షిత్ రాణా 29 (23; 2×4, 1×6),
రోహిత్ శర్మ 26 (29; 3×4, 2×6), కె.ఎల్.రాహుల్ 29 నాటౌట్ (21; 2×4, 1×6) బ్యాట్ ఝళిపించడంతో భారత్ మరో ఓవర్ మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది. న్యూజిలాండ్ బౌలర్లలో కైల్ జేమీసన్ 4 వికెట్లతో రాణించాడు. ఆదిత్య అశోక్, క్రిస్టియన్ క్లార్క్ ఒక్కో వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్ విజయంతో భారత్ 1-0 ఆధిక్యం లోకి వెళ్లింది.