టాటా స్టీల్ చెస్ టోర్నీ: నిహాల్ సరీన్ కు సిల్వర్.. అర్జున్ కు బ్రాంజ్

Spread the love

టాటా స్టీల్ చెస్ టోర్నీ బ్లిట్జ్ విభాగంలో యువ గ్రాండ్ మాస్టర్ అర్జున్ ఇరిగేశి కాంస్య పతకం గెలిచాడు. ర్యాపిడ్ లో  కాంస్యం గెలిచిన నిహాల్ సరీన్ బ్లిట్జ్ లో ఇంకా మెరుగైన ప్రదర్శనతో సిల్వర్ మెడల్ కైవసం చేసుకున్నాడు. నిహాల్, అర్జున్ 18 రౌండ్లలో 11 పాయింట్లతో సమంగా ఉన్నా టైబ్రేక్లో మెరుగైన స్కోరుతో నిహాల్ ద్వితీయ  స్థానంలో నిలిచాడు. అమెరికా ఆటగాడు వెస్లీ సో (12 పాయింట్లు) టైటిల్ కైవసం చేసుకున్నాడు. ప్రజ్ఞానంద (9.5 పాయింట్లు) 6 దిగ్గజ ఆటగాడు విశ్వనాథన్ ఆనంద్ (8 పాయింట్లు) 8వ  స్థానాలతో సరిపెట్టుకున్నారు. ఉత్కంఠగా సాగిన మహిళల పోరులో కరిస్సా యిప్ (10.5 పాయింట్లు) టైటిల్ గెలుచుకుంది. వంతిక ఆగర్వాల్ (10.5 పాయింట్లు) సిల్వర్ మెడల్  సాధించింది. వైశాలి (9.5 పాయింట్లు), దివ్య దేశ్ముఖ్ (8.5 పాయింట్లు) వరుసగా 5, 8 స్థానాలలో ఉన్నారు.