భారత్ స్టార్టప్ లలో  ప్రపంచానికి నాయకత్వం వహించాలి:ప్రధాని మోదీ  

Spread the love

మన దేశంలో స్టార్టప్ లు మ్యానుఫ్యాక్చరింగ్, డీప్ టెక్నాలజీ సెక్టార్స్ పై దృష్టి సారించాలని  ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. తాజాగా ప్రధాని మోదీ  భారత మండపంలో ‘స్టార్టప్ ఇండియా’ 10వ  వార్షికోత్సవంలో మాట్లాడారు. ఈ సందర్భంగా దేశ ఆర్థిక భవిష్యత్తుకు స్టార్టప్ లు కీలకమని పునరుద్ఘాటించారు. ఈ రంగంలో భారత్ ప్రపంచానికి నాయకత్వం వహించాలని ఇదే యువత టార్గెట్  కావాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. 10 ఏళ్ల  క్రితం దేశంలో 500 స్టార్టప్ లు   ఉంటే, ప్రస్తుతం 2 లక్షల పైనే ఉన్నాయన్నారు. 2014లో 4 యూనికార్న్ లు మాత్రమే ఉంటే ఇప్పుడు వాటి సంఖ్య 125కు చేరుకుంది. ఈ సక్సెస్ స్టోరీ ప్రపంచం ఆశ్చర్యంతో చూస్తోందని  ఇందులో మహిళల పాత్ర కూడా ఉందని పేర్కొన్నారు. 45 శాతం స్టార్టప్లో మహిళా  భాగస్వామ్యం ఉందని తెలిపారు. ప్రస్తుత యువత అందరూ నడిచిన తేలికైన  దారుల్లో ప్రయాణించటానికి ఇష్టపడటం లేదని కొత్త బాటలు సృష్టించుకుంటున్నారని అన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం కూడా యువత  వెంట ఉంటుంది. యువత  సామర్థ్యాలపై మాకు నమ్మకం ఉంది. మీ ధైర్యం, విశ్వాసమే దేశ భవిష్యత్ కు కీలకమని స్పష్టం చేశారు. రానున్న పదేళ్లలో స్టార్టప్ ట్రెండ్స్ లో , టెక్నాలజీలో ప్రపంచానికి మనదేశం నాయకత్వం వహించాలన్నారు.  ఇదే మన లక్ష్యం కావాలి. కొత్త ఆలోచనలపై దృష్టి పెట్టాలి. ఉదాహరణకు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, విప్లవంలో మనం ఎంత ముందుంటే అంత లాభమని పేర్కొన్నారు.  స్వదేశీ ప్రతిభతో భారత సర్వర్లలో ఏఐ రూపకల్పన జరిగేలా కృషి చేస్తున్నాం. సెమీ కండక్టర్లు, డేటా సెంటర్లు, గ్రీన్ హైడ్రోజన్, ఇత రంగాల్లోనూ  ఈమేరకు తగిన కృషి జరుగుతున్నట్లు తెలిపారు.