ఇటీవల జరిగిన ముంబయి పుర పోరులో ఎన్డీయే తన హవా చూపించింది. 227 స్థానాలున్న బృహన్ ముంబయి కార్పొరేషన్ (బీఎంసీ)లో అధికారాన్నిదక్కించుకునేందుకు అవసరమైన 114 సీట్ల కన్నా అధికంగానే బీజేపీ ,షిండే- శివసేన తో కూడిన మహాయుతి కూటమి గెలుచుకుంది. బీజేపీ 89 స్థానాల్లో షిండే నేతృత్వంలోని శివసేన 27 చోట్ల విజయబావుటా ఎగురవేసింది. ఉద్దవ్ రాక్రే నేతృత్వంలోని యుబీటీ-శివసేన 64 స్థానాలను కైవసం చేసుకుంది. రెండు దశాబ్దాల పాటు విడివిడిగా ఉన్న ఉద్దవ్ ఠాక్రే. రాజ్ ఠాక్రే (ఎం.ఎన్.ఎస్) ఈ ఎన్నికలకు ముందే కలిసినా మహాయుతి విజయాన్ని అడ్డుకోలేకపోయారు. ముంబై మహానగరంపై మూడు దశాబ్దాలుగా అవిభాజ్య శివసేన కొనసాగించిన ఆధిపత్యానికి గండిపడింది. ఠాక్రే కుటుంబానికి కంచుకోటగా ఉన్న బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) లో బీజేపీ ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఆ పార్టీ నేతృత్వంలో మహాయుతి కూటమి అధికారాన్ని చేపట్టనుంది. మహారాష్ట్రలోని 20 మున్సిపల్ కార్పొరేషన్లకు ఈ నెల 15న పోలింగ్ నిర్వహించగా శుక్రవారం ఓట్ల లెక్కింపు చేపట్టారు. 25 నగరాల్లో మహాయుతి కూటమి అగ్రభాగాన దూసుకెళ్తుంది. మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని కూటమి ఘన విజయం సాధించడంపై ప్రధాని హర్షం వ్యక్తం చేశారు. శరద్ పవార్ కు చెందిన ఎన్సీపీ (ఎస్పీ), అజిత్ పవార్ చెందిన ఎన్సీపీ(ఏపీ) పుణె. పింప్రి చించ్వాడ్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పొత్తుపెట్టుకుని పోటీ చేసినా ఆ రెండు చోట్లా బీజేపీ భారీ ఆధిక్యం సాధించింది..