ప్రజాకవి, సామాజిక సంస్కర్త యోగి వేమన జయంతి సందర్భంగా ఆయనకు ఏపీ సీఎం చంద్రబాబు ఘననివాళి అర్పించారు. ఈమేరకు సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా పోస్ట్ చేశారు. కులమత భేదాలు, మూఢ నమ్మకాలను పారద్రోలేందుకు యోగి వేమన తన పద్యాల ద్వారా చేసిన కృషి ఈనాటి సమాజానికి ఎంతో ఉపయుక్తమని సీఎం చంద్రబాబు అన్నారు. విశ్వదాభిరామ వినురవేమా అంటూ ఆయన చెప్పిన నీతి సూత్రాలు అనుసరణీయం. అలాంటి మహనీయుడి జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం అంటే మనల్ని మనం సన్మార్గంలో నడిపించుకోవడమేనని తన పోస్ట్ లో చంద్రబాబు పేర్కొన్నారు.