ఫిబ్రవరిలో ఏపీ అసెంబ్లీ సమావేశాలు

Spread the love

ఫిబ్రవరి నెలలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈమేరకు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు తెలిపారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వచ్చే నెల రెండు లేదా మూడో వారంలో సమావేశాలు ఉంటాయన్నారు. ఈ సమావేశాలకు వైసీపీ అధినేత జగన్ సహా వారి ఎమ్మెల్యేలు హాజరవుతారని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. అసెంబ్లీకి రాకుండా శాలరీలు తీసుకునే అంశాన్ని ఎథిక్స్ కమిటీ పరిశీలిస్తుందన్నారు. వరుసగా 60 రోజుల పని రోజులపాటు అసెంబ్లీకి రాకపోతే అనర్హత వేటు పడుతుందన్నారు. మధ్యలో ఒకరోజు వచ్చి వెళ్లిపోతే ఏమి చేయలేమన్నారు. డిప్యూటీ స్పీకర్ గా ఉంటూ తానెప్పుడు కూడా రాజకీయాలు మాట్లాడలేదని పేర్కొన్నారు. తాను పార్టీకి రాజీనామా చేయలేదని కొందరు రాష్ట్రపతికి గవర్నర్ కు లేఖలు రాశారని రూల్స్ ప్రకారం రాజీనామా చేయాల్సిన అవసరం లేదనే విషయం వారికి తెలియకపోవచ్చని అన్నారు.