మన శంకర వర ప్రసాద్ లేటెస్ట్ కలెక్షన్ రిపోర్ట్..!

Spread the love

మెగాస్టార్ మన శంకర వర ప్రసాద్ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో మనకి తెలిసిందే కదా… ఆల్రెడీ ఈ సినిమా 300 కోట్లు దాటేసింది… కాబట్టే సంక్రాంతి వారంలో టాలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు వర్కింగ్ డేస్‌లోనూ తన స్టామినాను నిరూపించుకున్నారు. పండుగ హడావుడి ముగిసిన తర్వాత వచ్చిన సోమవారం నుంచే సినిమా మంచి హోల్డ్‌ను చూపిస్తూ ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటికే ప్రాంతీయ సినిమాల బాక్సాఫీస్ చరిత్రలో ఎన్నో రికార్డులను తిరగరాసి, పూర్తి స్థాయి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.విడుదలై పది రోజులు పూర్తయ్యాక, గురువారం నుంచి టికెట్ రేట్లు మళ్లీ నార్మల్ రేట్ కి వచ్చాయి. దాంతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన సెంటర్లలో థియేటర్లకు ప్రేక్షకుల ఒకేసుపెన్సీ మంచి స్థాయిలో కొనసాగుతోంది. ఫెస్టివల్ హైప్ తగ్గినప్పటికీ, రెగ్యులర్ టికెట్ ప్రైస్‌లతో సినిమా మరో బలమైన వీకెండ్‌ను టార్గెట్ చేస్తోంది. అంతేకాదు, సోమవారం వచ్చే రిపబ్లిక్ డే సెలవు కూడా కలిసిరావడంతో, ఆ రోజు కలెక్షన్లు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.అదే ఊపును కొనసాగిస్తే, ప్రతిష్టాత్మకమైన ₹400 కోట్ల మార్క్ దిశగా సినిమా మరింత దగ్గరగా వెళ్లే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.ఈ ఘనవిజయానికి ప్రధాన కారణంగా మెగాస్టార్ చిరంజీవి ఆకట్టుకునే నటనతో పాటు, అనిల్ రావిపూడి స్టైల్‌లో రాసిన కామెడీ సీన్స్ అని చెప్పచు. రిలీజ్ రోజే ప్రీమియర్ షోల నుంచే సినిమాకు యూనానిమస్ పాజిటివ్ టాక్ రావడం, ప్రేక్షకులు థియేటర్లలో నవ్వులతో ఎంజాయ్ చేయడం ఈ సినిమాను భారీ బ్లాక్‌బస్టర్‌గా మార్చడంలో కీలక పాత్ర పోషించాయి. ఇక నయన్ శశిరేఖ గా చూపించిన పొగరు, స్టైల్ అలాగే మన విలన్ సచిన్ కూడా సైలెంట్ కిల్లర్ గా అదరగొట్టడం కూడా ఈ సినిమా కి ప్లస్ పాయింట్స్. అలాగే పెద్ద నటులే కాదు, మెగాస్టార్ కిడ్స్ గా నటించిన పిల్లలు ఇంకా మన బుల్లి రాజు కామెడీ అదుర్స్. ఇలా సినిమా లో ఎక్కడ బోర్ కొట్టిన ఎలిమెంట్ లేదు. లాస్ట్ లో వెంకీ గౌడ తో కాథరిన్ పెళ్లి కూడా మంచి ఎండింగ్ ఇచ్చిందని అందరు అన్నారు. మన వెంకీ గౌడ బాచిలర్ గా మిగిలిపోతే ఎలా…సో, సంక్రాంతి పండుగ సందర్భంగా ఒకదానికొకటి పోటీగా ఎన్నో సినిమాలు విడుదలైనప్పటికీ, ‘మన శంకర వర ప్రసాద్ గారు’ మాత్రం మెగాస్టార్ కరిజ్మా, అనిల్ రావిపూడి ట్రాక్ రికార్డ్‌ను నమ్ముకుని పండుగ సీజన్‌ను పూర్తిగా డామినేట్ చేసింది. అందుకే ఈ సినిమా ఇప్పుడు కేవలం ఒక హిట్ మాత్రమే కాదు… 2026 సంక్రాంతికి గుర్తుండిపోయే బాక్సాఫీస్ ఫీనామెనాన్‌గా మారింది.