మన సముద్ర తీరం సుసంపన్నమైన జీవవైవిధ్యానికి నిలయం

Spread the love

రుషికొండ సముద్ర తీరంలో అరుదైన మరియు అద్భుతమైన దృశ్యం ఆవిష్కృతమైంది. స్కూబా డైవర్లు సముద్రంలో డైవింగ్ చేస్తున్న సమయంలో ఒక భారీ వేల్ షార్క్ వారికి కనిపించింది. ఆ అతిపెద్ద జీవి వారి పక్కనే ఎంతో ప్రశాంతంగా ఈదుకుంటూ  కనిపించడం విశేషం. తీరానికి సుమారు 2 కిలోమీటర్ల దూరంలో, 45 అడుగుల లోతులో స్కూబా డైవింగ్ చేస్తున్న నలుగురు సభ్యుల బృందానికి ఈ భారీ సముద్ర జీవి ఎదురైంది.  రుషికొండ సముద్ర తీరంలో ఈ వేల్ షార్క్ కనిపించడంతో  ఇది విశాఖ సముద్ర జీవ వైవిధ్యానికి మరో ప్రత్యేక ఉదాహరణగా నిలిచింది. ఇక ఈ ఘటనపై ఏపీ మంత్రి నారా లోకేష్ స్పందించారు. సోషల్ మీడియాలో ఒక పోస్ట్ కు బదులిస్తూ ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగంలో పెద్దగా ఎవరికీ తెలియని, కానీ అద్భుతమైన మరో కోణం ఉంది. మన సముద్ర తీరం సుసంపన్నమైన జీవవైవిధ్యానికి నిలయం, అందుకే ఇది క్రమంగా స్కూబా డైవింగ్‌కు స్వర్గధామంగా మారుతోందన్నారు. దీనికి తోడు, విశాఖపట్నం తీరంలో ఉన్న అరుదైన నౌకా శిథిలాలు (shipwrecks) ఆంధ్రప్రదేశ్ జలాలను సాహసం, పర్యావరణం మరియు నీటి అడుగున ఉండే వారసత్వ సంపద కలబోతగా మారుస్తున్నాయని పేర్కొన్నారు. ఇది సుస్థిర సముద్ర పర్యాటకానికి అత్యంత అనువైన ప్రాంతమని పేర్కొన్నారు.