గత రెండు సంవత్సరాలుగా యూట్యూబ్‌లో ఒక పాట continuous గా ట్రెండ్ అవుతూనే ఉంది. స్టార్ హీరోయిన్ నటించిన ఆ స్పెషల్ సాంగ్‌ను చూడాలంటేనే నెటిజన్స్‌లో ఒక ప్రత్యేక ఆసక్తి. ఆ పాట ఏంటో తెలుసా… అయ్యో ‘ఆజ్ కీ రాత్’ అండి బాబు… ఈ పాట ప్రతి పార్టీ లో పెళ్లి సంగీత్ లో, బాచిలర్ పార్టీస్ లో ఇంకా డాన్స్ ఫ్లూర్స్ మీద మోగాల్సిందే. ప్రతి ప్లే లిస్ట్ లో కచ్చితంగా ఉంటుంది కూడా. అందుకే తాజాగా ఈ సాంగ్ యూట్యూబ్‌లో 1 బిలియన్ వ్యూస్ అంటే 100 కోట్ల వ్యూస్ మైలురాయిని దాటుకుని, భారతీయ చిత్ర పరిశ్రమలో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది. 2024లో విడుదలై బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ‘స్త్రీ 2’ సినిమాలో ఈ పాటను చిత్రీకరించారు. ఈ స్పెషల్ సాంగ్‌లో మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా నటించింది. విడుదలైన కొద్ది రోజులలోనే ఈ పాటకు అద్భుతమైన స్పందన వచ్చింది. తమన్నా లుక్స్, ఆమె గ్రేస్, డ్యాన్స్ మూవ్స్ ప్రేక్షకులను ఒక్కసారిగా ఆకట్టుకున్నాయి. థియేటర్లలో ఈ పాట వచ్చినప్పుడు అభిమానులు ఈలలు వేస్తూ, సీట్లలో కూర్చోలేక స్టెప్పులు వేస్తూ చేసిన హంగామా అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.సినిమా రిలీజ్ అయి చాలా కాలం గడిచినా, ‘ఆజ్ కీ రాత్’ పాట క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ఇప్పటికీ యూట్యూబ్‌లో వేగంగా వ్యూస్ పెంచుకుంటూ దూసుకుపోతోంది. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా వీక్షించబడిన భారతీయ పాటల జాబితాలో ఈ సాంగ్ అగ్రస్థానంలో నిలవడం విశేషం. ఇది కేవలం ఒక సినిమా పాట మాత్రమే కాదు… ఒక ట్రెండ్, ఒక ఫీలింగ్‌గా మారిపోయింది.ఈ పాటకు సంగీతం అందించినది సచిన్–జిగర్. వారి ట్యూన్ ఈ పాటకు ప్రధాన బలం. పాటను మధుబంటి బాగ్చి, దివ్య కుమార్ తమ గొంతులతో మరింత అందంగా మలిచారు. ఇక అమితాబ్ భట్టాచార్య రాసిన సాహిత్యం యువతను విపరీతంగా ఆకట్టుకుంది. ఇదే కాదు… తమన్నా కెరీర్‌లో స్పెషల్ సాంగ్స్‌కు ఇది మరో మైలురాయి. గతంలో రజనీకాంత్ నటించిన ‘జైలర్’ సినిమాలోని ‘కావాలా’ పాటతో ఆమె ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు ‘ఆజ్ కీ రాత్’తో తన క్రేజ్‌ను మరో స్థాయికి తీసుకెళ్లింది. ఒక హీరోయిన్‌కు స్పెషల్ సాంగ్ ఇంత పెద్ద రేంజ్‌లో రికార్డు సృష్టించడం చాలా అరుదైన విషయం. తమన్నా కూడా సోషల్ మీడియా ఈ న్యూస్ షేర్ చేసి 1 బిలియన్ వ్యూస్ దాటిన ఆనందాన్ని అభిమానులతో పంచుకుంటూ, వారికి కృతజ్ఞతలు తెలిపింది. “మీ ప్రేమే నాకు నిజమైన బహుమతి” అంటూ అభిమానులకు థ్యాంక్స్ చెప్పింది.భారతీయ సినిమాల చరిత్రలో 100 కోట్ల వ్యూస్‌ను దాటిన పాటలు చాలా తక్కువ. అలాంటి అరుదైన జాబితాలో తమన్నా నటించిన ‘ఆజ్ కీ రాత్’ చేరడం ఆమె కెరీర్‌లో ఒక చిరస్మరణీయ ఘట్టంగా నిలిచిపోయింది.