సన్నీ డియోల్ border 2 కి ఆ దేశం లో నో ఎంట్రీ…?

Spread the love

రిపబ్లిక్ డే సందర్బంగా థియేటర్లలో ఈరోజు రిలీజ్ ఐన హిందీ చిత్రం ‘బోర్డర్ 2’ అప్పుడే మంచి టాక్కు సొంతం చేసుకుంది… కానీ ఈ సినిమాకు విడుదలకు ముందే పెద్ద షాక్ తగిలింది. ఇప్పటికే ఓవర్సీస్ మార్కెట్‌పై భారీ అంచనాలు పెట్టుకున్న ఈ సినిమాకు, గల్ఫ్ దేశాల్లో నిషేధం విధించినట్లు తాజాగా తెలుస్తోంది. ఇటీవలే ‘ధురంధర్’ సినిమాకు కూడా ఇలాంటి పరిస్థితి ఎదురవ్వగా, ఇప్పుడు మరో బాలీవుడ్ బిగ్ మూవీ అదే బాటలో నడవాల్సి వచ్చింది.తాజా సమాచారం ప్రకారం, బహ్రెయిన్, కువైట్, ఒమాన్, ఖతార్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి ప్రధాన గల్ఫ్ దేశాల్లో ‘బోర్డర్ 2’ విడుదలకు అనుమతి లభించలేదు. సాధారణంగా ఈ ప్రాంతాల్లో ‘పాకిస్తాన్ వ్యతిరేకంగా ఉందని భావించబడే’ కంటెంట్ ఉన్న సినిమాలకు అనుమతి ఇవ్వరు. ‘బోర్డర్ 2’ కూడా ఆ కోవలోకే వస్తుందని భావించి, అక్కడి సెన్సార్ బోర్డులు ఈ సినిమాపై నిషేధం విధించినట్లు సమాచారం.అయినా కూడా, గల్ఫ్ దేశాల్లో సినిమాను విడుదల చేయాలని నిర్మాతలు చివరి వరకూ ప్రయత్నాలు చేశారు. కానీ అవి ఫలించలేదు. ఫలితంగా, విడుదలకు ముందే ఈ కీలక మార్కెట్‌ను కోల్పోవాల్సి వచ్చింది. ఇది సినిమాకు ఓవర్సీస్ బాక్సాఫీస్ పరంగా గణనీయమైన నష్టాన్ని తెచ్చిపెట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.సాధారణంగా బాలీవుడ్ సినిమాలకు గల్ఫ్ మార్కెట్ చాలా కీలకం. ముఖ్యంగా దేశభక్తి నేపథ్యం ఉన్న సినిమాలకు అక్కడ మంచి కలెక్షన్లు వస్తుంటాయి. కానీ ఈసారి పరిస్థితి భిన్నంగా మారింది. ఈ నిషేధం వల్ల ‘బోర్డర్ 2’ టీమ్ ఇప్పుడు ఊహించిన దానికంటే తక్కువ ఓవర్సీస్ వసూళ్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఇలాంటి పరిస్థితి ఇటీవల విడుదలైన ‘ధురంధర్’ సినిమాకు కూడా ఎదురైంది. ఆ సినిమా గల్ఫ్ దేశాల్లో విడుదల కాకపోవడం వల్లే దాదాపు రూ.90 కోట్ల వరకు నష్టం వచ్చిందని డిస్ట్రిబ్యూటర్లు వెల్లడించారు. అదే తరహాలో, ఇప్పుడు ‘బోర్డర్ 2’కూ గల్ఫ్ మార్కెట్ కోల్పోవడం పెద్ద దెబ్బగా మారుతుందని అంచనా వేస్తున్నారు.అయితే, ఈ అడ్డంకుల మధ్య కూడా భారత్‌లో మాత్రం ‘బోర్డర్ 2’పై అంచనాలు భారీగానే ఉన్నాయి. దేశభక్తి నేపథ్యంతో తెరకెక్కిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి ఉంది. ముఖ్యంగా ‘బోర్డర్’ మొదటి భాగానికి ఉన్న క్రేజ్, దానికి కొనసాగింపుగా వస్తున్న ఈ సినిమా మీద హైప్‌ను మరింత పెంచింది.