క్రెడిట్ కార్డ్ వడ్డీలపై నియంత్రణ అవసరమని బీజేపీ ఎంపీ పురంధేశ్వరి అన్నారు. భారతదేశంలో క్రెడిట్ కార్డ్ వినియోగదారులపై 24% నుంచి 48% వరకు, కొన్ని చోట్ల 55%కి పైగా వార్షిక వడ్డీ రేట్లు, పెనాల్టీ ఛార్జీలు విధించడం సాధారణ ప్రజలపై తీవ్రమైన ఆర్థిక భారం మోపుతోందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో, వినియోగదారులను దోపిడీ రుణ విధానాల నుంచి రక్షించడమే లక్ష్యంగా అమెరికాలో, అక్కడి ప్రభుత్వం క్రెడిట్ కార్డ్ వడ్డీ రేట్లను గరిష్ఠంగా 10%కి పరిమితం చేయాలనే ప్రతిపాదనను ముందుకు తీసుకువచ్చిందని భారతదేశంలో కూడా క్రెడిట్ కార్డ్ వడ్డీ రేట్లు & పెనాల్టీ ఛార్జీలపై గరిష్ఠ పరిమితి విధించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.RBI మార్గదర్శకాలకు అనుగుణంగా, వినియోగదారుల హితాన్ని కాపాడే కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి శ్రీమతి నిర్మల సీతారామన్ ని కలిసి ఎంపీ పురంధేశ్వరి వినతిపత్రం అందించారు.