రథసప్తమి వేడుకలకు టీటీడీ ఏర్పాట్లు

Spread the love

ఈనెల రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని వైభవంగా వేడుకలను నిర్వహించేందుకు టీటీడీ సిద్ధమవుతోందని ఛైర్మన్ బి.ఆర్.నాయుడు తెలిపారు. స్థానిక అన్నమయ్య భవన్ లో ఈవో అనిల్ కుమార్ సింఘాల్, బోర్డు మెంబర్స్ జ్యోతుల నెహ్రు, పనబాక లక్ష్మీ అడిషనల్ ఈవో వెంకన్న చౌదరితో కలిసి మీడియాతో మాట్లాడారు. రథసప్తమి సందర్భంగా సాధారణ భక్తులకు ప్రాధాన్యతనిస్తూ వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు. భక్తుల కోసం 14 రకాల అన్నప్రసాదాలు తయారు చేస్తున్నట్లు వివరించారు. గ్యాలరీలోని భక్తుల కోసం 85 కౌంటర్లలో ఉదయం నుంచి రాత్రి వరకు అన్న ప్రసాదాలు అందించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. రథ సప్తమి రోజున ఉదయం సూర్యప్రభ వాహన సేవ ఆ తరువాత చిన్న శేష, గరుడ, హనుమంత వాహన సేవలు ఉంటాయన్నారు. మధ్యాహ్నం 2నుండి 3మధ్యలో చక్రస్నానం, తరువాత కల్పవృక్ష, సర్వభూపాల, చంద్రప్రభ సేవలు ఉంటాయన్నారు.