50% అమెరికా సుంకాలు (tariffs) మరియు అనిశ్చితి వల్ల భారతదేశ వస్త్ర ఎగుమతిదారులు తీవ్రంగా నష్టపోతున్నారని కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభ విపక్ష నేత రాహుల్ గాంధీ సోషల్ మీడియా ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు. ఉద్యోగాల కోత, కర్మాగారాల మూత మరియు ఆర్డర్లు తగ్గిపోవడం మన ‘స్తంభించిన ఆర్థిక వ్యవస్థ’ యొక్క చేదు నిజాలు అంటూ పేర్కొన్నారు.
4.5 కోట్లకు పైగా ఉద్యోగాలు, లక్షలాది వ్యాపారాలు ప్రమాదంలో ఉన్నప్పటికీ, మోదీ గారు ఎటువంటి ఉపశమనం ప్రకటించలేదు, కనీసం ఈ సుంకాల గురించి మాట్లాడలేదని కేంద్రం తీరును ఎండగట్టారు. మోదీ గారు, దీనికి మీరే జవాబుదారీ; దయచేసి ఈ విషయంపై దృష్టి సారించండి అంటూ రాహుల్ తన పోస్ట్ లో పేర్కొన్నారు. వస్త్ర ఎగుమతిదారులతో మాట్లాడుతున్న ఒక వీడియోను తన పోస్ట్ లో పొందుపరిచారు. భారత ఎగుమతులపై అమెరికా సుంకాల ప్రభావంపై ఈమేరకు స్పందించారు.