ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి లక్షల కోట్ల పెట్టుబడుల సాధనే లక్ష్యంగా నాలుగు రోజుల దావోస్ పర్యటనలో ఏకంగా 36 సమావేశాలలో పాల్గొని, కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న ఇండస్ట్రియల్ పాలసీలు, ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్, స్పీడ్ఆఫ్ డూయింగ్ బిజినెస్ తదితర పారదర్శక విధానాల గురించి, రాష్ట్రానికి తరలివచ్చే పెట్టుబడిదారులకు, పరిశ్రమలకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పలు రాయితీలు, ప్రోత్సాహకాల గురించి వివరించి, పలు దిగ్గజ సంస్థలతో లక్షల కోట్ల విలువైన ఒప్పందాలు కుదుర్చుకుని, విజయవంతంగా ఏపీ సీఎం చంద్రబాబు రాష్ట్రానికి తిరిగి చేరుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి చేరుకున్న సీఎం చంద్రబాబుకు మంత్రులు కొల్లు రవీంద్ర, అనగాని సత్యప్రసాద్, పార్థసారథి ఉండవల్లి నివాసంలో స్వాగతం పలికారు. ఏపీ సీఎంగా 1995లో మొదటి సారి సియం అయిన దగ్గర నుంచి, దావోస్ కి వెళ్లి, ఏపి పెట్టుబడుల కల్పన కోసం చంద్రబాబు దావోస్ పర్యటనలు సంగతి తెలిసిందే.