బాలికలే భవిష్యత్ దీపికలని ఏపీ విద్యా,ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. సరైన నైపుణ్యాలు, అవకాశాలు కలిస్తే ఆకాశమే హద్దుగా రాణిస్తారని బాలికల హక్కులు, విద్య, భద్రత కోసం కూటమి ప్రభుత్వం కృషిచేస్తోందని పునరుద్ఘాటించారు. బాలికలపై వివక్షను విడనాడదాం. వారికి సమాన అవకాశాలు కల్పిద్దామని పిలుపునిచ్చారు.
ఏపీ సీఎం చంద్రబాబు అందరికీ జాతీయ బాలికా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఒక సమాజం యొక్క నిజమైన పురోగతి అనేది ఆ సమాజంలోని కుమార్తెలు సాధికారత పొందినప్పుడు, రక్షించబడినప్పుడు మరియు విజయానికి సమాన అవకాశాలు లభించినప్పుడే సాధ్యమవుతుందని ఈ సందర్భంగా తెలిపారు. దేశ నిర్మాణంలో బాలికలు చురుకైన భాగస్వాములు అయ్యేలా వారిని ప్రోత్సహిస్తూ, వారికి సమాన అవకాశాలు కల్పించి, వారిని సాధికారత వైపు నడిపించేందుకు మనల్ని మనం పునరంకితం చేసుకునేందుకు ఈ రోజు ఒక గొప్ప అవకాశమని చంద్రబాబు ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు.