ఇండోనేషియా మాస్టర్స్ ప్రపంచ టూర్ సూపర్ 500 టోర్నీలో భారత షట్లర్లు పి.వి.సింధు, లక్ష్యసేన్ ల పోరాటం ముగిసింది. తాజాగా జరిగిన మహిళల సింగిల్స్ లో సింధు 13-21, 17-21తో చైనాకు చెందిన చెన్ యుఫెయ్ చేతిలో ఓటమి చెందింది. ఇక పురుషుల సింగిల్స్ క్వార్టర్స్ లో లక్ష్యసేన్ 18-21, 20-22తో థాయిలాండ్ కు చెందిన పనిచాఫాన్ చేతిలో పరాజయం చెందాడు.