సిక్కోలు రథసప్తమి ఉత్సవాలు–2026 సందర్భంగా శ్రీకాకుళంలో శోభాయాత్ర అద్భుతంగా నిర్వహించబడడడం పట్ల కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఈ శోభాయాత్రను రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చంనాయుడు ఘనంగా ప్రారంభించారు. ఈ మహా ఊరేగింపులో హిందూ పురాణాల నైతికతను, సమకాలీన శ్రీకాకుళం మరియు జిల్లా ముఖ్యమైన విజయాలను చక్కగా ప్రదర్శించారన్నారు. శకటాలు మరియు ప్రతిభావంతులైన కళాకారుల ప్రదర్శనలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
అంతేకాకుండా శ్రీకాకుళంలో తొలిసారిగా నిర్వహించిన డ్రోన్ ప్రదర్శన ప్రజలకు ఒక మంచి అనుభవాన్ని అందించిందని తెలిపారు. శ్రీకాకుళం యొక్క స్ఫూర్తి, సాంస్కృతిక గొప్పతనం మరియు గర్వాన్ని ప్రతిబింబించే ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినందుకు ఎమ్మెల్యే గోండు శంకర్, కలెక్టర్ స్వప్నిల్ దినకర్ నేతృత్వంలోని జిల్లా యంత్రాంగం మరియు కార్యక్రమానికి సహకరించిన అందరిని ఈ సందర్భంగా అభినందించారు.