38 ఏళ్లకే రిటైర్మెంట్ ప్రకటించిన పాపులర్ సింగర్..!

Spread the love

అదేంటి అప్పుడే రిటైర్మెంట్ ఆ… అవును నిజమే…జనరల్ గా ఇలా ఈ ఏజ్ లో ఏదైనా స్పోర్ట్స్ లో రిటైర్మెంట్ తీసుకుంటారు కదా… కానీ ఇక్కడ రిటైర్మెంట్ తీసుకుంది ఒక సింగర్…బాలీవుడ్ స్టార్ సింగర్ అరిజిత్ సింగ్… భారతీయ సినీ సంగీత ప్రపంచంలో తన మాయాజాలమైన స్వరంతో కోట్లాది మంది హృదయాలను తాకిన ప్రముఖ గాయకుడు అరిజిత్ సింగ్ తన కెరీర్‌కు సంబంధించిన ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కేవలం 38 ఏళ్ల వయసులోనే ప్లేబ్యాక్ సింగింగ్‌కు గుడ్‌బై చెప్పనున్నట్లు ఆయన ప్రకటించడం దేశవ్యాప్తంగా ఉన్న సంగీత ప్రేమికులను ఒక్కసారిగా షాక్‌కు గురి చేసింది.

ఇది నిజంగా ఎవ్వరూ ఊహించని నిర్ణయమే. ఎందుకంటే ప్రస్తుతం అరిజిత్ సింగ్ తన కెరీర్‌లో అత్యున్నత స్థాయిలో ఉన్నారు. డిమాండ్, పాపులారిటీ, గౌరవం… అన్నీ ఒకేసారి ఉన్న దశలో ఆయన తీసుకున్న ఈ నిర్ణయం అభిమానులను భావోద్వేగానికి గురిచేసింది. “ఇప్పుడే ఎందుకు?” అనే ప్రశ్నతో పాటు, “ఇక ఆ స్వరం సినిమాల్లో వినిపించదా?” అనే బాధ అభిమానుల గుండెల్లో నిండిపోయింది. హిందీ సినిమా సంగీతానికి అరిజిత్ సింగ్ చేసిన సేవ అమోఘం. ముఖ్యంగా 2010 తర్వాత ఆయన పాడిన ఎన్నో పాటలు చాల క్లాసిక్స్‌గా నిలిచిపోయాయి. ప్రేమ, బ్రేక్ అప్, బాధ, ఆశ… ఏ ఎమోషన్ ఐన సరే, అరిజిత్ స్వరంలో అది మరింత లోతుగా హృదయానికి చేరేది. కాలం మారినా, ట్రెండ్స్ మారినా, ఆయన పాటల వినిపింపు మాత్రం ఏమాత్రం తగ్గలేదు. నేటికీ చిన్నపిల్లల నించి పెద్దల వరకు, ప్రతి ఏజ్ వాళ్ళు ఆయన పాటలను అదే ఆసక్తితో ఆస్వాదిస్తారు.

హిందీ చిత్రాలకే పరిమితం కాకుండా, అరిజిత్ సింగ్ తెలుగు, తమిళ, మలయాళ చిత్ర పరిశ్రమలలో కూడా కొన్ని పాటలు పాడారు. ఆ పాటలు సౌత్ ఇండియన్ ప్రేక్షకుల్లోనూ మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. భాష ఏదైనా, భావం ఒకటే అన్నట్లుగా, ఆయన స్వరం అందరిని ఇంకా ముఖ్యనగ మ్యూజిక్ లవర్స్ ని ఇంప్రెస్స్ చేసింది! కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే… అరిజిత్ సింగ్ ప్రకటించిన రిటైర్మెంట్ ఓన్లీ ప్లేబ్యాక్ సింగింగ్ కి మాత్రమే. అంటే ఇక సినిమాల్లో ఇతర హీరోల కోసం పాటలు పాడకపోవచ్చు. కానీ సంగీత ప్రయాణం మాత్రం కొనసాగుతుంది. ఇండిపెండెంట్ మ్యూజిక్, కవర్ సాంగ్స్, లైవ్ కాన్సర్ట్స్, వ్యక్తిగత మ్యూజికల్ ప్రాజెక్ట్స్ వంటి వాటి ద్వారా ఆయన తన స్వరాన్ని అభిమానులకు వినిపించే అవకాశముంది. ఈ నిర్ణయం సంగీత అభిమానులకు కాస్త కఠినంగా అనిపించినా, ఇది పూర్తిగా ఆయన వ్యక్తిగత నిర్ణయం. అభిమానులు ఎంత బాధపడినా, అరిజిత్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని గౌరవిస్తూనే, ఆయన పాడిన ఆ అమూల్యమైన పాటలను జీవితాంతం మనసులో నిలుపుకుంటారు.ప్లేబ్యాక్ సింగింగ్‌కు గుడ్‌బై చెప్పినా, అరిజిత్ సింగ్ స్వరం పాటల రూపంలో, జ్ఞాపకాల రూపంలో, మన హృదయాల్లో శాశ్వతంగా ఉంటుంది.