సంక్రాంతి సినిమాల గురించి ఇంకా మాట్లాడాలా??? అంటే… ఈ సారి అలా కలిసొచ్చింది మరి. సంక్రాంతి హాలిడేస్ తరవాత కూడా ఇప్పటికీ ఈ సినిమాలకు మంచి ప్రేక్షకాదరణ కొనసాగుతోంది. రిపబ్లిక్ డే వీకెండ్ కూడా బాగా కలిసి వచ్చింది. సో, వాలెంటైన్స్ డే వరకు కూడా పెద్ద సినిమాలు అడ్డు లేకపోవడం తో, ప్రేక్షకులు ఈ సినిమాలే మళ్లీ మళ్లీ చూసేందుకు ఇష్టపడుతున్నారంట…
ప్రభాస్ రాజా సాబ్ కలెక్షన్స్ 250 కోట్లు దాటేశాయి… రవి తేజ భర్త మహాశయులులు కూడా మంచి ఆదరణతో నడుస్తోంది. నవీన్ పోలిశెట్టి అనగనగ ఒక రాజు సినిమా గురించి చెప్పాలంటే, అబ్బో నవీన్ కెరీర్ లోనే ఫస్ట్ 100 కోట్ల గ్రాసర్ గా నిలిచి, ఈ పొంగల్ కి నిర్మాతలకి భారీ లాభాలు తెచ్చిపెట్టింది. శర్వానంద్ నటించిన నారి నారి నడుమ మురారి సినిమా గురించి చెప్పాలంటే, మంచి క్లీన్ ఎంటర్టైనర్. సో, ఈ సినిమా కూడా మంచి వసూళ్లను రాబట్టి ఈ సంక్రాంతి పండుగలో తన వాటాను కూడా గట్టిగానే పట్టుకెళ్లింది. ఇక ఈ సంక్రాంతి అందరికంటే బాగా అదరగొట్టింది మెగాస్టార్ నటించిన ‘మన శంకర వర ప్రసాద్ గారు’ ఈ సినిమా ఆల్మోస్ట్ 400 కోట్ల కలెక్షన్ దెగ్గరికి వచ్చేసింది. ఇంకో పది రోజుల్లో అది కూడా దాటేస్తుంది ట్రేడ్ పండితులు విశ్లేషిస్తున్నారు.